సినిమా టికెట్ రేట్లపై ఏపీకి షాక్ ఇచ్చిన హైకోర్ట్!


ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో కౌంటర్ పడింది. ఇటీవల టికెట్ల రేట్లను భారీగా తగ్గించి కొత్త జీవో నెం.35ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆ విషయంలో సస్పెండ్‌ విధించడం హాట్ టాపిక్ గా మారింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించాలని తీర్పును ఇచ్చారు. 

ఇటీవల ఆంద్రప్రదేశ్ టికెట్‌ రేట్లను తగ్గించడంలో అసంతృప్తి వ్యక్తం చేసిన థియేటర్‌ యజమానులు కొత్త జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆదేశాలకు విరుద్ధంగానే ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. అంతే కాకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యమైనది కాదని కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే రైట్ హక్కు థియేటర్‌ ఓనర్స్ ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక మంగళవారం హైకోర్టులో వాదనల అనంతరం  కోర్టు ఏకీభవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన న్యూ జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Post a Comment

Previous Post Next Post