స్నేహితులతో సమంత బికినీ ట్రీట్.. గోవా హాలిడేస్!


సమంత అక్కినేని నాగచైతన్య ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకులు అనంతరం సమంత తన జీవితాన్ని మరింత ఆనందంగా కొనసాగిస్తోంది. గతంలో కంటే ఎక్కువగా సమంత గ్యాప్ దొరికినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల న్యూఇయర్ సందర్భంగా గోవా వెళ్ళినట్లుగా అర్థమవుతోంది.


ఇక తనకు అత్యంత క్లోజ్ గా ఉండే స్నేహితులతో కలిసి సమంత గోవాలోని ఒక ప్రముఖమైన వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఆనందంగా గడిపేనట్లు ఫోటోలు చూస్తుంటే తెలిసిపోతుంది.. సమంత మొదటి సారి బికినీ లో దర్శనమిచ్చిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఆమె స్నేహితులు కూడా అదే తరహాలో దర్శనం ఇచ్చారు. ఈ ఫోటోలను ఫాలోవర్స్ కూడా చూసి చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. సమంత త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వస్తోంది.


Post a Comment

Previous Post Next Post