జూనియర్ ఎన్టీఆర్ తో సమంత?


టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా సినిమాలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కసారి ఆ రూట్లో సక్సెస్ వస్తే అదే తరహాలో ముందుకి సాగే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక RRR సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాలని అనుకుంటున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా సమంత సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఇదివరకే వీరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో సమంత పాత్ర నిడివి చాలా తక్కువ. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో చాలా కీలకమైన పాత్ర దక్కించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.  మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post