కన్నడ ప్రెస్ మీట్ లో పుష్ప టీమ్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మీడియా ముందుకు ఆలస్యంగా రావడంతో ఓ జర్నలిస్టు గట్టిగానే ప్రశించాడు. మీ బృందం ప్రెస్ మీట్ 11:15కి షెడ్యూల్ చేయబడిందని మరియు మీరు 1:15కి వచ్చారని, ఇది న్యాయమా? అని విలేకరి ప్రశ్నించారు. ఇక అల్లు అర్జున్ ముందుగా వారికి క్షమాపణ చెప్పడం జరిగింది.
పొగమంచు కారణంగా, నా ప్రైవేట్ జెట్ సరైన సమయంలో బయలుదేరలేదు మరియు మీరు ఈవెంట్‌కు ఇంత త్వరగా ఆహ్వానించబడ్డారని నాకు తెలియదు. నేను దీని గురించి నిజంగా చింతిస్తున్నాను మరియు క్షమాపణ చెప్పడం నాకు తప్పుగా, బాధగా అనిపించడం లేదు.. అని బన్నీ వివరణ ఇచ్చారు. ఇక తమ బాధ అర్థమైతే చాలని క్షమాపణ అవసరం లేదని సదరు జర్నలిస్టు వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment