శ్యామ్ సింగరాయ్ లో టైమ్ ట్రావెల్: డైరెక్టర్


కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో శ్యామ్ సింగరాయ్ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది.  నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు.

తాజా ఇంటర్వ్యూలో, రాహుల్ శ్యామ్ సింగ రాయ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ ఉందని, కథ మరియు దాని పాత్రలు ఆధ్యాత్మిక టచ్ కలిగి ఉంటాయని చెప్పారు. మరియు ఈ చిత్రం పీరియాడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని కూడా రాహుల్ వివరణ ఇచ్చారు.  శ్యామ్ సింగ రాయ్ ఒక పురాణ ప్రేమకథ అని సినిమా కథ రెండు విభిన్న కాలాలలో జరుగుతుందట. ఒకటి ప్రస్తుత కాలంలో మరియు మరొకటి 1960లలో అని వివరణ ఇచ్చిన  రాహుల్ ఊహించిన ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో VFX మరియు ప్రొడక్షన్ డిజైన్ కీలకంగా సినిమాకు హెల్ప్ అయినట్లు చెప్పారు.


Post a Comment

Previous Post Next Post