పుష్ప కోసం రాబోయే స్టార్స్ ఎవరు?


అల్లు అర్జున్ యొక్క పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12 న జరగబోతోంది అని వార్తలు ఇప్పటికే జోరుగా వినిపిస్తున్నాయి.  ఈ వేడుకకు బాహుబలి స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది.  గీతా ఆర్ట్స్ వర్గాల నుండి వస్తున్న టాక్ ప్రకారం పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ అతని తండ్రి అల్లు అరవింద్ సపోర్ట్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అరవింద్ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనప్పటికీ, అతను తన హిందీ వెంచర్ జెర్సీ హీరో షాహిద్ కపూర్‌ని ముఖ్య అతిథిగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్.  అదే సమయంలో, బన్నీ ఈ ఈవెంట్‌కి ప్రభాస్‌ను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.  మరియు మెగాస్టార్ చిరంజీవి కూడా తన షూటింగ్ షెడ్యూల్స్ నుంచి గ్యాప్ దొరికితే వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ వార్త నిజమైతే, అల్లు అర్జున్ ముగ్గురు ముఖ్య అతిధులతో ఓకే వేదికపై దర్శనమిస్తాడు.  వాస్తవానికి, బాలయ్య ఇప్పుడు అల్లు కాంపౌండ్‌కి దగ్గరవుతున్నందున, మెగాస్టార్ చిరు రాకపోతే అతను చేరతాడని కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.  ఏది ఏమైనా ఈ ఈవెంట్‌కి హాజరయ్యే ముఖ్య అతిధుల విషయంలో క్లారిటీ రావాలంటే రెండు మూడు రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post