ఆహా కోసం సుకుమార్ స్క్రిప్ట్


తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహా నెమ్మదిగా జనాదరణను పెంచుకుంటోంది. గత కొన్ని నెలలుగా కొత్త సబ్‌స్క్రైబర్‌లు అమాంతం పెరిగారు.  బాలయ్య యొక్క సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్' సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆహా రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఒరిజినల్, టాక్‌షో మరియు వెబ్ సిరీస్‌లను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తోంది.  అగ్ర దర్శకుడు సుకుమార్ చాలా కాలం క్రితమే ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్ చేస్తానని మాట ఇచ్చాడు. 

స్క్రిప్ట్‌పై మూడు నెలల పాటు పనిచేసిన తర్వాత అతను ఈ వెబ్ సిరీస్‌కు స్క్రిప్ట్‌ను కూడా రాశాడు. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఆహా మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించనున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను సుకుమార్‌ అందించనున్నారు.  కథానాయకుడు, దర్శకుడు ఎవరనేది త్వరలో ఖరారు కానుంది.  దర్శకుడు కథ నాయకుడు ఫిక్స్ అయిన తరువాత అధికారిక ప్రకటన చేయబడుతుందని సమాచారం.


Post a Comment

Previous Post Next Post