అయితే DSP వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరాలు లేవనెత్తారు. “దేవిశ్రీ ప్రసాద్ భక్తి పాటలను ఐటెం సాంగ్స్‌తో ఎలా పోల్చగలరు? హిందూ భక్తి గీతాలు మరియు నినాదాలకు వ్యతిరేకంగా DSP ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనవసరం. మా మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే దేవి శ్రీ ప్రసాద్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను' అని రాజా సింగ్ అన్నారు. అంతే కాకుండా "డీఎస్పీ క్షమాపణలు చెప్పకుంటే చెప్పులతో స్వాగతం పలుకుతాం" అని రాజా సింగ్ హెచ్చరించారు.
Follow @TBO_Updates