Pushpa Movie @ Review


అల్లు అర్జున్ సుకుమార్‌ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప: ది రైజ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా వెండితెరపైకి వచ్చిన ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిల్మ్ గా రూపొందింది. సుకుమార్ - అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ మొదటి పాన్ ఇండియా మూవీ ప్రీమియర్ షోలతో ఫ్యాన్ షోలతో హడావిడి స్టార్ట్ చేసింది. ఇక సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం..

కథ: 
పుష్ప రాజ్ (అల్లు అర్జున్)... కొండా రెడ్డి (అజయ్ ఘోష్) మరియు జాలీ రెడ్డి (ధనంజయ్) గ్యాంగ్ గ్రూప్‌లో పని చేసే రోజువారీ కూలీ. అతను అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుంటారు. పుష్ప ఒక సాధారణ కూలీ నుండి రెడ్డి బ్రదర్స్‌తో పాటు సహ-యజమానిగా ఎదుగుతాడు.  ఆ తర్వాత అతను మంగళం సూరి (సునీల్) నుంచి పెద్ద ముప్పును ఎదుర్కొంటాడు.  పుష్ప వివిధ అడ్డంకులను అధిగమించి, ఎర్ర  స్మగ్లర్ డాన్‌గా ఎలా బయటపడ్డాడు.. అలాగే శ్రీవల్లి అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) నుంచి అతనికి ఎలాంటి ఛాలెంజ్ ఎదురయ్యింది అనేది మిగతా కథ!

విశ్లేషణ..
దర్శకుడు సుకుమార్ తన కెరీర్ లో చాలా వరకు ఫ్రెష్ బ్యాక్‌డ్రాప్, కథ మరియు వినోదాత్మక స్క్రీన్‌ప్లే తోనే ఆకట్టుకుంటు వచ్చాడు. అయితే పుష్ప ది రైజ్‌లో, అతను కథ విషయంలో అంతగా ఆకట్టుకోలేదు. పుష్ప అనేది ఒక టెంప్లేట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, కథానాయకుడు ఒక గ్యాంగ్ లో ఎలా ఎదిగాడు ఆ తరువాత గ్యాంగ్ లో ఏర్పడిన కోట్లటాలు మరొక వ్యక్తి నుంచి వచ్చిన ముప్పులు చూస్తే ప్రేక్షకులకు అంత కొత్తగా ఏమి అనిపించదు.  ఈ కేసులో ఎక్కువగా స్మగ్లింగ్ నేపథ్యం ఉంది.  హీరో స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు వివిధ కోణాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా సినిమాలో అందరికి నచ్చింది ఏమైనా ఉందని అంటే అది అల్లు అర్జున్ చేసిన పుష్ప పాత్రే.
పుష్ప (పాత్ర) పై బన్నీ చేసిన కృషి మొదటి నుండి కనిపిస్తుంది.  బాడీ లాంగ్వేజ్ మరియు సెట్టింగ్ కాకుండా డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఇక మిగతా పాత్రను పరిచయం చేయడంతో కథనం మళ్లీ రీస్టార్ట్ మోడ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. మదర్ యాంగిల్ ద్వారా 'బ్రాండ్' ఆలోచన బాగానే ఉంది, కానీ అది చా హడావిడిగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది.

మంగళం శ్రీను పాత్ర కూడా అనుకున్నంతగా కనెక్ట్ అవ్వలేదు అనే చెప్పాలి. ఆడియెన్స్ అతని పాత్రను భయంకరమైన విలన్ గా ఏమి చూడలేరు. ఎదో నెగిటివ్ రోల్ తరహాలో అనిపిస్తుంది. ఇక అనసూయ తన పరిధి మేరలో బాగానే ఆకట్టుకుంది.
 సెకండాఫ్‌లోని ఓపెనింగ్ యాక్షన్ ఎపిసోడ్ మిగిలిన కథకు మేజర్ ప్లస్ పాయింట్. దర్శకుడు హీరో కంటే విలన్స్ ఇంకా బాగా ప్రజెంట్ చేయగలిగితే సినిమా మరోలా ఉండేదెమో. భన్వర్ సింగ్ పాత్ర చివరి అరగంటలో పెద్దగా ప్రభావం ఏమి చూపలేదు. ఆడియెన్స్ అంచనాలకు యాక్షన్ సన్నివేశాలు తప్పితే దర్శకుడు మిగిలిన ఎమోషన్ ను అనుకున్నంతగా హైలెట్ చేయలేదు. ఇక రష్మీక మందన్న పాత్ర గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. శ్రీవల్లి పాత్ర సాధారణంగానే ఉంటుంది. సినిమాలోని మొదటి అరగంట అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఉంటాయి. ఇక సెకండ్ క్లామాక్స్ సెకండ్ పార్ట్ కోసం ఒక ఛాలెంజ్ విసిరినప్పటికి అది ప్రేక్షకుల ఉహాలకే వదిలేయడం మంచిది. ఎందుకంటే కమర్షియల్ ఆడియెన్స్ కు ఆ ఎపిసోడ్ కనెక్ట్ అవ్వచ్చు లేదంటే అవసరం లేదు అనవచ్చు. 

ఫైనల్ గా.. 
ఇక అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. ఫస్ట్ లుక్ వచ్చిన రోజు నుంచి గెటప్ మన దృష్టిని ఆకర్షించింది. సినిమా చూసినప్పుడు ఇది సాధారణ మేకోవర్ మాత్రమే కాదని అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ (చిత్తూరు మాండలికం) కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడని అర్ధమవుతుంది. అయితే పుష్ప కథ కథనం విషయంలో మాత్రం అంచనాలకు అందుకోలేకపోయింది. ఫైనల్ గా సినిమాను అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర కోసం చూడవచ్చు. 

ప్లస్ పాయింట్స్:
👉పుష్ప రాజ్ రోల్
👉ఇంటర్వెల్ బ్లాక్
👉సాంగ్స్

మైనస్ పాయింట్స్:
👉స్టోరీ & స్క్రీన్ ప్లే
👉 వీక్ నెగిటివ్ రోల్స్
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉రన్ టైమ్

బాటమ్ లైన్: ఇది పుష్ప రాజ్ షో మాత్రమే.. 

రేటింగ్: 2.75/5

Post a Comment

Previous Post Next Post