RRR జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. యూనిట్ కూడా సినిమాను దూకుడుగా ప్రమోట్ చేస్తోంది. అయితే, ఓమిక్రాన్ ముప్పు మధ్య, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు మరియు సినిమా హాళ్లలో 50% సీటింగ్ సామర్థ్యాన్ని ప్రకటించాయి.
దీంతో ఈ రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్ థియేట్రికల్ విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు, RRR యొక్క OTT రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. థియేట్రికల్ విడుదల ఫార్మాట్ లోనే ఆయా రాష్ట్రాల్లో RRR నేరుగా OTTలో పే పర్ వ్యూ ఆధారంగా విడుదల కావచ్చని వినికిడి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఆ ప్లాన్ వర్కౌట్ అయితే RRR సినిమా ఒక సరికొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫార్మట్ లో పైరసీ దెబ్బ అనేది ఈజీగా ప్రభావం చూపుతుంది. మరి ఎలా ఆలోచిస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment