Shyam Singha Roy @ Review


నాని సినీ జీవితంలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు. ఇక సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ..
వాసుదేవ్ (నాని) ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు అందుకుంటాడు. ఇక సినిమా దర్శకుడు అవ్వాలని ప్రణాళికలు రచిస్తూ.. ఇందులో హీరోయిన్ గా కీర్తిని తీసుకుంటాడు. అయితే వాసు 1970 నాటి కథను కాపీ చేసి ఫిల్మ్ తీశాడని ఒక ప్రముఖ ప్రచురణకర్త ఆరోపించినప్పుడు అతని కలలకు బ్రేక్ పడుతుంది. లీగల్ ప్రొసీడింగ్స్ సమయంలో వాసుదేవ్ తనది అసలు కథ అని వదిస్తాడు. అయితే క్లినికల్ హిప్నాసిస్ ద్వారా వాసు గత జీవితాన్ని శ్యామ్ సింగరాయ్ గా వెల్లడిస్తుంది.  మిగిలిన సినిమాలో 1970ల కాలం నాటి కథలో శ్యామ్ సింగరాయ్ - దేవదాసి మైత్రేయి ప్రేమకథ గురించి ఉంటుంది. ఇక వాసు ప్రస్తుత జీవితానికి ఆ కథ కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ తరువాత వాసుకు ఎదురైన ప్రశ్నలు ఏంటి? అసలు శ్యామ్ జీవితం ఎలా ముడిపడి ఉంటుంది? రెండు విభిన్నమైన ప్రేమ కథలు ఎలా ముందుకు సాగాయి అనే అంశాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే..

విశ్లేషణ:
నాని పాత్రతో సినిమా ఒక అభిరుచి గల ఫిల్మ్ మేకర్ కథగా ప్రారంభమవుతుంది. పాటలు సినిమాలో చాలా ఆర్ట్ ఫామ్ లో జటాయి. రెండు పాటలు విజువల్ రిచ్ గా ఉన్నాయి.  ఉప్పెన స్టార్ కృతి శెట్టి పాత్ర అంతగా హైలెట్ అనిపించదు. కానీ పాటల్లో ఆమె అందంతో కాస్త బాగానే ఆకట్టుకుంది. సింపుల్ కామెడీతో మొదటి సగం మంచి టైమ్ పాస్ మూవీ అని చెప్పవచ్చు. ఇక శ్యామ్ సింఘా రాయ్ కథ మొదలవ్వడంతో సినిమా బెంగాలీ ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. 
బెంగాలీ వ్యక్తి, తల్లికి మహిళకు జన్మించిన శ్యామ్ ఖరగ్‌పూర్‌లో సంఘ సంస్కర్తగా అలాగే తిరుగుబాటు కవిగా కొనసాగుతాడు.  

శ్యామ్, ఒక దేవదాసి అయిన మైత్రేయి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒక అణచివేత భూస్వామ్య వ్యవస్థ బారి నుండి విముక్తి చేస్తాడు. వీరి మధ్య సాగే కొన్ని సన్నివేశాలు ఏరియల్ షాట్‌లు అత్యద్భుతంగా ఉన్నాయి.  సాను వర్గీస్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ‘ప్రణవాలయ’, ‘నేల రాజు నీ' పాటలు చాలా బాగా చిత్రీకరించారు.  సాయి పల్లవి డ్యాన్స్‌లో రాణించడంతో పాటు క్లాసికల్ డ్యాన్స్‌లలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి.  ఆమె మైత్రేయి పాత్రకు సరైన కాస్టింగ్ ఎంపిక అని చెప్పవచ్చు.  మిక్కీ జె మేయర్ పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.

దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ 'స్క్రీన్ ప్లే పునర్జన్మ కాన్సెప్ట్‌ను ప్రదర్శించడానికి కొన్ని అంశాలను బాగానే కనెక్ట్ చేశాడు. ఈ తరహా పాక్షిక పీరియాడిక్ సినిమాకి కావాల్సిన బడ్జెట్‌ను నిర్మాతలు చాలా బాగా ఖర్చు చేశారు. అయితే క్లైమాక్స్ లో మాత్రం సినిమా అనుకున్నంతగా లేదు. కొన్ని సన్నివేశాలు కథను లాగదీసినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మరికొన్ని  సన్నివేశాలపై ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే బావుండేది. ఇక సినిమా డైలాగ్స్ కథలో భాగంగా బాగున్నాయి. దైవత్వం గురించి చెప్పే సీన్స్ ఆలోచింపజేస్తాయి. 

ప్లస్ పాయింట్స్: 
👉సరికొత్త కథ 
👉సాంగ్స్ 
👉నాని & సాయి పల్లవి కెమిస్ట్రీ 
👉కవితాత్మక దృశ్యాలు, మంచి సాహిత్యం 

మైనస్ పాయింట్స్: 
👉సెకండ్ హాఫ్ క్లైమాక్స్ 
👉కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం 


ఫైనల్ గా.. 
శ్యామ్ సింఘా రాయ్ అద్భుతంగా తీసిన ఎమోషనల్ ఫిల్మ్. దర్శకుడు రాహుల్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఆకర్షణీయమైన మరియు కవితాత్మకమైన ప్రేమ కథను అందించే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా సినిమాను ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అని చెప్పవచ్చు 

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post