సలార్.. ఆ సీన్స్ కోసం 75కోట్లు?


రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాల్లో సలార్ ఒకటి. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు. ఇక సలార్ సినిమాలో ప్రతి అంశం హైలెట్ అయ్యేలా పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా సినిమాలో క్లయిమాక్స్ యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సలార్ సినిమాను ఇప్పటికే రెండు భాగాలుగా తెరపైకి తీసుకురానున్నట్లు ఒక గట్టి టాక్ అయితే వస్తోంది. ఇక సినిమాలోని ఒక భాగం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం దాదాపు 75కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. గతంలో ఏ సినిమా క్లైమాక్స్ కోసం కూడా ఏ రేంజ్ లో అయితే ఖర్చు చేసింది లేదు. ఇక ప్రశాంత్ నీల్ మాత్రం సినిమాలో హైలెట్ అయ్యే విధంగా ఆ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరపైకి తీసుకు రానున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post