స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తరువాత మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక పుష్ప 2 తరువాత లైనప్ మరింత పవర్ఫుల్ గా ఉండాలని ఇతర ఇండస్ట్రీలోని దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. వేణు శ్రీరామ్ తో ఐకాన్ ఉంటుందా ఉండదా అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
బోయపాటి శ్రీనుతో బాలయ్య మల్టీస్టారర్ ఉంటుందని ఇటీవల ఒక హింట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. లైకా ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ చేయబోయే సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. విజయ్ తో తెరి, మర్సల్, బిగిల్ వంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన అట్లీ తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తాడని అప్పట్లో టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment