ఐకాన్ స్టార్ కాదు.. లక్కీ స్టార్!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి తనను తాను ఐకాన్ స్టార్ గా మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక విధంగా ప్రస్తుత పరిస్థితులను బట్టి గమనిస్తే అతను లక్కీ స్టార్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా ఫస్ట్ వెవ్ కొద్ది దూరంలో ఉన్నప్పుడే అల.. వైకుంటపురములో.. సినిమా భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఆ విజయంతో అల్లుఅర్జున్ దాదాపు రెండేళ్లు చాలా సంతోషంగా ఉన్నాడు.

ఇక ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ తీవ్రంగా మారుతున్న సమయంలో బిగ్ బడ్జెట్ మూవీ పుష్ప 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో అతని మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఒమిక్రాన్ పెరుగుతున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను అందుకుంది. దీన్ని బట్టి చూస్తే అల్లుఅర్జున్ అదృష్టం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పాన్ ఇండియా సినిమాలు విడుదల చేయాలి అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇక అల్లు అర్జున్ మాత్రం రెండు వారాల కంటే ముందే పుష్ప సినిమాను విడుదల చేసి మంచి విజయం సాధించాడు.


Post a Comment

Previous Post Next Post