కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన గాసిప్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇదివరకే ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారెజ్ తరహాలో ఒక పవర్ఫుల్ పాత్ర కూడా ఉంటుందట
మోహన్ లాల్ ఆ సినిమాలో ఎన్టీఆర్ కు పెదనాన్నగా కనిపించగా ఇప్పుడు 30వ ప్రాజెక్ట్ లో బాబాయ్ పాత్రలో మరొక సీనియర్ హీరో కనిపించే అవకాశం ఉందట. మీడియాలలో అయితే రాజశేఖర్ పేరు బాగానే వినిపిస్తోంది గాని ఇంకా చిత్ర యూనిట్ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలి కాబట్టి ఒక బిగ్ స్టార్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment