మరో మెగా హీరోతో శృతి హాసన్?


శ్రుతిహాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. వరుసగా సినిమాలు చేసేందుకు సంతకం చేస్తోంది. ఇప్పటికే మలినేని గోపీచంద్‌తో - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోయే తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బిగ్ బడ్జెట్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

బాబీతో చిరంజీవి ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అవ్వగా ఆ  సినిమా నిర్మాతలు కథానాయికగా నటించడానికి శృతిని సంప్రదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో గాసిప్ మొదలైంది. ప్రస్తుతం రెమ్యునరేషన్‌పై చర్చలు జరుగుతున్నాయట. శ్రుతి ఈ ప్రాజెక్ట్‌లను చేజిక్కించుకుంటే, ఆమె కెరీర్ మళ్లీ పెద్ద ఎత్తున ట్రాక్‌లోకి వస్తుందని చెప్పవచ్చు. ప్ర‌స్తుతం శృతి హాసన్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమాలో కూడా చేస్తోంది.


Post a Comment

Previous Post Next Post