పరిస్థితులు బావుండి ఉంటే ఈపాటికే RRR సినిమా మొదటి రోజు సందడి ఒక రేంజ్ లో ఉండేది. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి రాజమౌళి హాయిగా పార్టీ చేసుకునేవారు. కానీ కరోనా దెబ్బకు మరోసారి రాజమౌళి తీవ్ర నిరాశకు గురయ్యారు. మళ్ళీ అన్ని భాషలలో హ్యాపీగా రిలీజ్ చేయాలి అంటే అనువైన డేట్ దొరకడం కష్టం.
ఇక ఈసమయంలో రాజమౌళి ఎలా ఉన్నారు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇక ప్రస్తుతం ఏం చేసినా కూడా పరిస్థితులను ఎవరు మార్చలేరు కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచించిన రాజమౌళి మహేష్ తో చేయబోయే ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరో నెల రోజుల పాటు పరిస్థితులు సెట్టవ్వవు కాబట్టి జక్కన్న RRR టెన్షన్ నుండి బయటకు వచ్చి మహేష్ కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా మహేష్ ప్రాజెక్ట్ పై మాత్రం RRR విడుదల తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment