సంక్రాంతి పోటీలో మొత్తం ఎన్ని సినిమాలంటే..?


త్రిబుల్ ఆర్ సినిమా వాయిదా పడటంతో ఒక్కసారిగా సంక్రాంతి పోటీలో చాలా మార్పులు వచ్చాయి. రాధేశ్యామ్ జనవరి 14, బంగార్రాజు జనవరి 13 లేదా 15న వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రెండు సంక్రాంతికి రాబోతున్నాయి అంటున్నారు.  ఇక ఈ సినిమాలతో పాటు మరొక ఎనిమిది సినిమాలు కూడా సంక్రాంతి పోటీలో కలెక్షన్స్ అందుకునేందుకు సిద్ధమయ్యాయి.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమా అలాగే మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చి', దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి 'రౌడి బాయ్స్' సినిమాలు కూడా అఫీషియల్ గా సంక్రాంతికి రాబోతున్నాయి అని తేల్చేశారు. అలాగే ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన '7 డేస్ 6 నైట్స్', ఆది సాయి కుమార్ 'అతిథిదేవోభవ', సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' వంటి సినిమాలు కూడా సంక్రాంతి పోటీకి సిద్ధం అయ్యాయి. అలాగే రాజ శేఖర్ 'శేఖర్' సినిమా తో పాటు మరొక సినిమా కూడా ఈ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post