బాలీవుడ్ లో దేవి శ్రీ ప్రసాద్?


థమన్, మిక్కీ జె మేయర్ అలాగే ఇతర సంగీత స్వరకర్తలు దేవిశ్రీప్రసాద్ ను ఈజీగా డామినేట్ చేస్తున్నట్లు కామెంట్స్ చాలానే వచ్చాయి ఇ మధ్య. కానీ దేవి శ్రీ ప్రసాద్ నుండి పుష్ప సినిమాతోనే తన పవర్ ఏమిటో చూపించాడు. దాదాపు పుష్ప అన్ని పాటలు టాప్ 100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియోల చార్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సూపర్ టాలెంటెడ్ కంపోజర్‌ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. T-సిరీస్ బాస్ భూషణ్ కుమార్‌ను డిఎస్పీ ఇటీవల కలిశారు. వీరి కలయికలో త్వరలోనే సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవి అయితే ముందుగానే ఒక షరతు కూడా పెడుతున్నాడు. ఏ సినిమాకైనా సరే ఒకే మ్యూజిక్ దర్శకుడు అంటేనే వారితో వర్క్ చేసేందుకు ఒప్పుకుంటాడట. మరి టీ సీరీస్ లో దేవి ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post