బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బన్నీ?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో సంచలనం విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం హిందీలో  స్ట్రాంగ్ నోట్ లో వెళుతోంది. ఇక నెక్స్ట్ బన్నీ వరుసగా పాన్-ఇండియన్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక పుష్ప 2 తో సిద్ధం కానున్న బన్నీ ఐకాన్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటికి రానున్నాడు.

ఇక బన్నీ లిస్టులో బోయపాటి కూడా ఉన్నాడు. అతని డైరెక్షన్ లో డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల బన్నీకి ఒక బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చిందట. అయితే ఆ స్క్రిప్ట్ అంతగా నచ్చకపోవడంతో వెంటనే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు తనకు కొత్తగా అనిపిస్తేనే బన్నీ కథను ఓకే చేసేందుకు ఒప్పుకుంటానని చెబుతున్నాడు. ప్రస్తుతానికి, అల్లు అర్జున్ బ్రేక్ లో ఉన్నాడు మరియు ఫిబ్రవరి నుండి పుష్ప 2 పై దృష్టి పెట్టనున్నాడు.


Post a Comment

Previous Post Next Post