ఆచార్య సాంగ్ పై RMPల పిర్యాదు!


మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమాలో పాటపై ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆచార్య చిత్ర యూనిట్ తాజాగా “సానా కష్టం” అనే ఐటెం సాంగ్ ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట మాస్‌లో ఇన్‌స్టంట్‌గా హిట్ అయింది.  భాస్కరబట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను రేవంత్ మరియు గీతా మాధురి ఆలపించారు.  ఈ పాటలో మెగా స్టార్‌తో పాటు రెజీనా తన స్టెప్పులతో ఆకట్టుకుంది. 

అయితే ఈ పాటలో “ఏదేదో నిమురొచని కుర్రాళ్లు RMPలు అయిపోతున్నారే” అనే లైన్ అసభ్యంగా ఉందని.. అంటే యువకులు రెజీనా లాంటి స్త్రీని ముట్టుకునే అవకాశం కోసం RMP డాక్టర్ అవుతున్నారని అర్థం వచ్చేలా ఉందట. ఇక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్యులు పాటలోని ఈ వాక్యాన్ని తప్పుగా గుర్తించి, ఈ పాట తమ వృత్తిని అవమానించేలా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు తెలంగాణకు చెందిన జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  గీత రచయిత, దర్శకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ఆచార్య చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Post a Comment

Previous Post Next Post