ప్రస్తుతం సౌత్‌లోని బిజీ నటీమణుల్లో సమంత ఒకరు. ఆమె లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి. హాలీవుడ్‌లోకి కూడా గ్రాండ్‌గా దూసుకెళ్లబోతున్న ఈ నటి, తన చరిష్మాతో బాలీవుడ్‌ను కూడా ఆకర్షిస్తోంది. సమంతకు ఉత్తరాదిలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో తగినంత పాపులారిటీ వచ్చింది. ఇక తాజాగా ఆమె చేతిలో మూడు హిందీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
బాలీవుడ్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన యష్ రాజ్ ఫిల్మ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు బలమైన టాక్ ఉంది. ఒకేసారి మూడు సినిమాలకు సైన్ చేయమని సమంతకు కంపెనీ ప్రతిపాదించిందట. ఇక ఆమె ఈ ఒప్పందానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరో హిందీ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనుందట. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత, సమంతా రూత్ ప్రభు ఒక యాక్షన్ వెబ్ సిరీస్ కోసం రాజ్ & డికెతో మళ్లీ జతకట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక శకుంతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment