టాలీవుడ్ రిలీజ్ డేట్స్.. అసలు సూత్రధారి ఎవరంటే?


మొత్తానికి సమ్మర్ లో సినిమాల విడుదల తేదీలపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. RRR , రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాలు ఎలాంటి క్లాష్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రానున్న రోజుల్లో థియేటర్స్ బిజినెస్ మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది. అయితే రిలీజ్ డేట్స్ వెనక అసలు సూత్రధారి దిల్ రాజు అని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో దిల్ రాజు సగానికి పైగా థియేటర్స్ ను తన కంట్రోల్ లోనే ఉంచుకున్నారు. ఏడాదికి లీజుకు తీసుకుంటూ వారికి నచ్చిన సినిమాలను అందులో విడుదల చేయిస్తూ ఉంటారు. ఇక పెద్ద సినిమాల విషయంలో ఆయన చెప్పడం వల్లనే అన్ని కూడా రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా RRR సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం.

 రాబోయే సినిమాల రికిజ్ డేట్స్ ఈ విధంగా ఉన్నాయి.
భీమ్లా నాయక్ - ఫిబ్రవరి 11 / ఏప్రిల్ 1
రాధే శ్యామ్ - మార్చి 11 (ఇంకా ప్రకటించలేదు)
RRR - మార్చి 25
F3 - ఏప్రిల్ 28
ఆచార్య - ఏప్రిల్ 29
సర్కారు వారి పాట - మే 12

Post a Comment

Previous Post Next Post