బాలీవుడ్ లో మరో బంపరాఫర్ కొట్టేసిన రకుల్


రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా తెలుగులో వరుసగా అపజయాలను చూస్తున్నప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఆఫర్లను అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. అందులో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు ఉండటం విశేషం. అంతేకాకుండా ఈ ఏడాది ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. 

ఇక రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బడా ప్రొడక్షన్ హౌస్ లో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నట్లు టాక్. ఇక రకుల్ చేతిలో బాలీవుడ్ సినిమాలు ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, ఆయాలాన్, ఇండియన్ 2 వంటి సినిమాలు ఉన్నాయి.


Post a Comment

Previous Post Next Post