మెగా ఫ్యాన్స్ కు పండగే.. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్


రాబోయే రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక అందులో మెగా హీరోల సిమిమాలే ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న గని సినిమా తెరపైకి రాబోతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కానుంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రావచ్చు.  రామ్ చరణ్ యొక్క RRR మార్చి 25న, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 29 విడుదల కానున్నాయి. ఇక  వరుణ్ తేజ్ మరో చిత్రం ఎఫ్3 ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇది షెడ్యూల్ ప్రకారం వస్తుందా లేదా మరింత ముందుకు వెళుతుందా అనేది ఇంకా తెలియదు. అనుకున్న సమయానికి వస్తే ఆ వీకెండ్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post