యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది. ఇంకా ఆ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ అయితే రాలేదు. ఇక ఆ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా రానుందట. ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మొన్నటివరకు కోకో కోచ్ గా కనిపిస్తాడని టాక్ వచ్చింది.
ఇక ఇప్పుడు కబడ్డీ ప్లేయర్ అని అంటున్నారు. ఈ సినిమాను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్ డ్రామాగా బుచ్చిబాబు స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ నుండి ఇటీవల సానుకూల ఆమోదం లభించడంతో ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా లాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఇక కొరటాల శివ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ బుచ్చిబాబుతో జాయిన్ అవుతాడని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మార్చిలో కొరటాల సినిమా షూటింగ్‌ని ప్రారంభించి, త్వరిత షెడ్యూల్‌లో ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తాడు. ఇక ప్రశాంత్ నీల్ తో కూడా వచ్చే ఏడాది కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment