భీమ్లా నాయక్ ఓటీటీ డేట్ ఫిక్స్?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ శుక్రవారం భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రికార్డు స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటిరోజు దాదాపు అన్ని ఏరియాల్లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్స్ దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం లో కూడా ప్రస్తుతం ఒక టాక్ వైరల్ గా మారుతోంది. సినిమాను తెలుగు ఓటీటీ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ డబ్బింగ్ హక్కులను హాట్ స్టార్ డిస్ని ప్లస్ కొనుగోలు చేసింది  ఇక ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తరువాత ఓటీటీలో భీమ్లా నాయక్ సందడి చేసే అవకాశం ఉంది. అంటే మార్చి మూడో వారంలో లేదా నాలుగో వారంలో భీమ్లా నాయక్ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post