కళావతి సాంగ్.. ఖరీదు ఎంతంటే?


టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకుంటున్న థమన్ ప్రతీ సినిమా విషయంలో డిఫరెంట్ మ్యూజిక్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాకుండా సాంగ్ జనాలకు మరింత బలంగా చేరువయ్యేలా ప్రమోషన్ చేసేందుకు కూడా ఆలోచిస్తున్నాడు.

ప్రమోషనల్ సాంగ్ ట్రెండ్ ను థమన్ ఎక్కువగా ఫాలో అవుతున్నాడు. అతను సినిమాకు మ్యూజిక్ అంధించడం కోసం రెండున్నర కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ ఉండగా కేవలం ప్రమోషనల్ సాంగ్ షూట్ కోసం మరో 40 లక్షలను ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాడట. కళావతి పాట కోసం కూడా అదే తరహాలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా షూట్ చేసి జనాలకు మరింత దగ్గరయ్యేలా సాంగ్ ను డిజైన్ చేశారు. ఇప్పటికే అల.. వైకుంఠపురములో, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, వంటి సినిమాలకు థమన్ ఇదే తరహాలో ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. 

Post a Comment

Previous Post Next Post