ఎన్టీఆర్ తో మహేష్ డైరెక్టర్?


గీతా ఆర్ట్స్‌కి అనుబంధ సంస్థ GA2కి గీత గోవిందం రూపంలో పరశురామ్ పెద్ద హిట్ అందించాడు. ఇక అదే బ్యానర్ అతనితో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే రొమాంటిక్ కామెడీ సినిమా కోసం ఎన్టీఆర్‌ని పరశురామ్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్‌తో పరశురామ్ సిద్ధంగా ఉన్నాడని, కథను వివరించడానికి త్వరలో ఎన్టీఆర్‌ని కలుస్తాడని సమాచారం.

ఎన్టీఆర్ కు నచ్చితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం పరశురామ్ మహేష్ బాబుతో తన సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ అయితే చివరి దశలో ఉంది. ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే బుచ్చిబాబుతో, ప్రశాంత్ నీల్ తో కూడా సినిమాలు చేయబోతున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post