ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సలార్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, అయితే ఈ చిత్రం OTT దిగ్గజాల నుండి లాభదాయకమైన ఆఫర్లను అందుకుంటుందని సమాచారం. ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ సినిమా OTT స్ట్రీమింగ్ హక్కులను పొందేందుకు రెండు అగ్ర OTT పోర్టల్‌లు నిర్ణతలతో చర్చలు ప్రారంభించాయి.
ఒక OTT దిగ్గజం సంస్థ అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 200 కోట్లకు పైగా ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మేకర్స్ ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదు. సలార్ అనేది చాలా భారీగా బజ్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ చిత్రానికి సంబంధించిన హైప్ పెరిగే కొద్దీ OTT ఆఫర్‌ల డోస్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు టెంప్ట్ అవ్వడం లేదని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment