Subscribe Us

మహేష్ కోసం బాలయ్య.. ఇది నిజమైతే ఆరచకమే?


ఇటీవల కాలంలో దర్శకులు నెవర్ బిఫోర్ అనేలా మల్టీస్టారర్ కథలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. హీరోలు కూడా గతంలో మాదిరిగా కాకుండా ఎలాంటి బేషరతులు లేకుండా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది.

అయితే త్వరలోనే బాలకృష్ణ - మహేష్ బాబు ఇద్దరిని కూడా వెండితెరపై చూసే అవకాశం ఉన్నట్లుగా మరో కొత్త టాక్ వినిపిస్తోంది. ఇక వారిని చూపించే దర్శకుడు మరెవరో కాదు. దర్శకధీరుడు రాజమౌళి అని తెలుస్తోంది. మహేష్ తో చేయబోయే SSMB29 ప్రాజెక్ట్ లో రాజమౌళి మరొక ముఖ్యమైన పాత్ర కోసం నందమూరి బాలకృష్ణని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలంటే అఫిషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే..

Post a Comment

0 Comments