పక్కా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకుల కంటే ఓ వర్గం హీరోలకి బాగా దగ్గరైపోయయిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇక ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను విజయ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ హీరో తో సినిమా చేసిన తర్వాత వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.
కానీ ముందుగా వంశీ పక్క బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాల్సిందే. అక్కడ సక్సెస్ కొడితేనే అతనికి మహేష్ బాబు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనంతరం రాజమౌళి పాన్ ఇండియా సినిమాతో ఎక్కడికి వెళ్లిపోతాడో చెప్పడం కష్టమే. అతని రేంజ్ అమాంతంగా పెరిగి పోతుంది కాబట్టి వంశీపైడిపల్లి అంతకు మించి అనేలా కథ సెట్ చేసుకోవాలి. ఇక వంశీ వంశీ పైడిపల్లి విజయ్ ను ఏం చెప్పి ఒప్పించాడో కానీ అంతకుముందు అతను తెలుగు హీరోల చుట్టు తిరిగినప్పటికి ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు. మరి విజయ్ వంశీతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment