బాలీవుడ్ మీడియా.. రాజమౌళి ముందు జాగ్రత్తలు!


దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించే ముందు దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే ఆలోచన కూడా ముందే ఊహించేస్తాడు. వీలైనంతవరకూ నెగిటివ్ రాకుండా చూసుకుంటూ జాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినిమాలపై కావాలని కొన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి అనే అనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు కావాలనే అలా నెగిటివ్ ప్రచారాలు చేయిస్తున్నారు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే ఈ విషయంలో ముందు జాగ్రత్తగా దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ మీడియాను ప్రత్యేకంగా లైన్ లో పెట్టనున్నట్లు సమచరం. ముందుగానే బాలీవుడ్ మీడియాతో మాట్లాడి ఈ చిత్రం ప్రమోషన్ లో వారిని కూడా ఒక భాగంగా చేయాలని ప్లాన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం కొంత ఖర్చు అయినా భరించాలి అని అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా బాలీవుడ్ మీడియా సౌత్ సినిమాలపై కాస్త నెగిటివిటీ నీ ప్రచారం ఎక్కువగా చేస్తుంది అనేది రాధే శ్యామ్ తో అర్ధమయ్యింది. ఇక RRR సినిమాకు జనాల నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని నమ్మకం ఉన్నప్పటికీ రాజమౌళి మాత్రం తన జాగ్రత్తలో తను ఉన్నట్లు తెలుస్తోంది


Post a Comment

Previous Post Next Post