కండోమ్ టెస్టర్ క్యారెక్టర్.. రకుల్ ఏం చెప్పిందంటే?


టాలీవుడ్ లో మొన్నటివరకు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో మాత్రం ఎక్కువగా బాలీవుడ్ లోనే బిజీగా మారిపోయింది. అమ్మడు ఎలాంటి సినిమా చేసినా కూడా పరవాలేదు అనే విదంగా ఎదో ఒక రకంగా ఆడేస్తున్నాయి. ఇక రకుల్ బాలీవుడ్ లో ఇటీవల స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ లో కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుందట.

కండోమ్ తయారు చేసిన అనంతరం అది ఎంతవరకు కరెక్ట్ గా ఉందొ చెక్ చేసే ఒక మహిళా వర్కర్ గా కనిపించనుందట. ఆ సినిమా ఛత్రివాలి అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఇక ఆ సినిమాలో అసభ్యకరంగా ఉండే సన్నివేశాలు ఉండవని చెప్పిన అమ్మడు కనీసం ముద్దు సన్నివేశాలు కూడా ఉండవట. కండోమ్ బిజినెస్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో ఒక అమ్మాయి కండోమ్ టెస్ట్ చేసే ఉద్యోగిణిగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది మిగతా కథ అని తెలిపింది. మరి ఈ సినిమా విడుదల అనంతరం ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post