ప్రభాస్ సలార్ లో మరో స్టార్ హీరో ఫిక్స్!


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రమోషన్ ప్రత్యేకంగా ప్రమోషన్ బాధ్యతను తీసుకోవడం విశేషం. అయితే ప్రభాస్ ఇటీవల మళయాళ భాషలో ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో సలార్ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు చెప్పారు.

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సలార్ లో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రభాస్ అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో ఆయన నటించడం చాలా గొప్ప విషయం అంటూ మలయాళం ఇండస్ట్రీలో ప్రభాస్ ఆ న్యూస్ వైరల్ అయ్యేలా చేశాడు. ఇక సలార్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు అనే విషయంలో కూడా ప్రభాస్ సరైన క్లారిటీ ఇవ్వలేదు. అది అబద్ధం అయితే చెప్పేవారు కాదా అని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post