ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పెద్ద సినిమాలకు కష్టంగానే మారింది. ఇక ఇటీవల రాధే శ్యామ్ సినిమాకి ఆదనపు షోలు మొదటి వారంలో టికెట్ల రేట్లతో హైక్స్ లేకపోవడంతో ఆ సినిమా చాలా తక్కువ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం RRR పై అలా ప్రభావం పడవద్దని రాజమౌళి సీఎం జగన్ ను కలువగా ఆయన సానుకూలంగా స్పందించి అవసరం అయినంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని రాజమౌళి అన్నాడు.
ఇక రాజమౌళి అలా చెప్పిన కొద్దిసేపటి సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నాని మాట్లాడుతూ.. ఆ మీటింగ్ లో తాను పాల్గొనేదాని రాజమౌళి దానయ్య ఏపీ సీఎం టికెట్ల రేట్లపై తీసుకొచ్చిన జీవో పై కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారని అన్నారు. అయితే టిక్కెట్ల రేట్ల విషయంలో రాజమౌళి సినిమాకి ఒకరేటు మరొక సినిమాకి ఒక రేటు ఉండవని ఆంధ్రలో అదనపు బెన్ఫిట్ షోలు కూడా ఉండవని తేల్చేశారు. టికెట్ల రేట్లు కూడా నిబంధనలకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పడంతో రాజమౌళి చర్చలకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయినట్లు అర్ధమయ్యింది.
Follow @TBO_Updates
Post a Comment