కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ఎవడు, టెంపర్, అఖిల్ ఏజెంట్ ఇలా విభిన్నమైన కథలతో ఇండస్ట్రీలో కథ రచయితగా మంచి క్రేజ్ అందుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా కూడా తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అసలైతే మొదట ఈ రైటర్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ గా పరిచయం అవ్వాల్సింది.
కానీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీకి మరో హీరో దొరకడానికి చాలా టైమ్ పెట్టింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు నితిన్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమాను ఆదివారం లాంచ్ చేశారు. నితిన్ హోమ్ బ్యానర్ లో రూపొందుతున్న ఆ సినిమాతో అయినా మనోడు హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక హరిస్ జై రాజ్ స్పైడర్ అనంతరం చేస్తున్న సినిమా ఇదే. అథానికి కూడా ఈ మూవీ చాలా కీలకం కానుంది.
Follow @TBO_Updates
Post a Comment