విశ్వక్ సేన్ × టీవీ యాంకర్ లొల్లి.. నమ్మితే మీ ఖర్మ!


ఒక సినిమాకు ప్రమోషన్ చేయడం ఇటీవల కాలంలో చాలా  ముఖ్యం అనే చెప్పాలి. జనాల ఎట్రాక్షన్ ఉంటేనే సినిమాకు మినిమమ్ ఒపెనింగ్స్ అందుతాయి అని చెప్పవచ్చు. అయితే కాంట్రవర్సీ ప్రమోషన్స్ డోస్ కూడా మరింత ఎక్కువైంది. విశ్వక్ సేన్ ఓ న్యూస్ ఛానెల్ లో చేసిన రచ్చ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే.

ఇక ఇలాంటి కాంట్రవర్సీలు గురించి కొందరు అమాయకులు పాపం నిజమనే అనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఇదివరకే తన సినిమాల విషయంలో ఇదే రేంజ్ లో కాంట్రవర్సీ హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇక సదరు ఛానెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా పనికి రాని విషయాలపై డిబేట్ పెడుతూనే ఉంటారు. గతంలో అర్జున్ రెడ్డిపై కూడా ఇలాంటి హడావుడి చేసిన ఆ యాంకరమ్మ మళ్ళీ ఆ తరువాత దేవరకొండతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది.

అసలు న్యూస్ ఛానెల్ లో ఎవరు కూడా తెగించి F*  అనే వర్డ్ కావాలని కూడా వాడరు. కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసే న్యూస్ ఛానెల్.. అందులోనూ ఎదురుగా మహిళ. ఇలాంటి డేర్ చేశాడు అంటే.. పక్కా స్క్రిప్ట్ అని వీరి వేశాల గురించి తెలిసిన ఎవరైనా చెబుతారు. ఇక ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు పాపం ఆ హీరో ఫ్యాన్ ఫాలోవర్స్ సపోర్ట్ చూసి జాలి పడుతూ.. నమ్మితే మీ ఖర్మ అనేలా స్పందిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post