మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించబడుతుందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజా అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ 31కి సంబంధించిన అప్‌డేట్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కంటే ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్ ఇవ్వడానికి మరో మంచి సమయం లేదని ఎన్టీఆర్ 31 మేకర్స్ భావిస్తున్నారు. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయనున్నాడు. NTR30 అప్‌డేట్ ఖచ్చితంగా ఉన్నప్పటికీ, NTR31కి సంబంధించి అఫీషియల్ అప్‌డేట్ అయితే లేదు. మరి మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు డబుల్ ధమాకా అందిస్తారో లేదో వేచి చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment