ఆచార్య.. డిజాస్టర్ వల్ల 18కోట్లు లాభం!


మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే సినిమా పనైపోయింది. ఇక సోమవారం నాటికి పూర్తిగా వాషౌట్ అయ్యింది. దాదాపు 80కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

సర్కారు వారి పాట రాబోతోంది కాబట్టి
ఇక చేసేదేమీ లేక చిత్ర యూనిట్ థియేటర్లలో నుంచి సినిమాను తీసేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఒక రూట్లో నిర్మాతలకు 18కోట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే ఓటీటీలో విడుదల చేస్తే 18కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందట. ఓటీటీలో వస్తే ఈ సినిమాను తప్పకుండా చూస్తారు కాబట్టి ముందుగా చేసుకున్న ఒప్పందం కంటే ఒక వారం ముందే ఓటీటీలో ఆచార్య రావచ్చు. అంటే నెక్స్ట్ వారంలోనే ఆచార్య అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post