మేజర్ సందీప్ అన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒక విధంగా అడివి శేష్ కెరీర్ మొత్తంలో ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ అందుకుంది. గత సినిమాల ఓపెనింగ్స్ తో పోలిస్తే మేజర్ మొదటిరోజు వసూళ్లు 5 రేట్లు ఎక్కువ. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ అయితే చాలా నమ్మకంతో ఉంది.
అయితే ఈ సినిమాతో అడివి శేష్ ఎలాగైనా 50కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు. మేజర్ సినిమాలో ఇదే ఫ్లోలో వెళితే 100కోట్ల వసూళ్లను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక అడివి శేష్ మార్కెట్ ను అయితే ఈ సినిమాతో పోల్చలేము. మేజర్ సందీప్ లైఫ్ కాబట్టి దీనికి ఉండే బజ్ వేరు. ఇక ఆ తరువాత శేష్ ఎలాంటి సినిమాలు చేస్తాడు అనే దానిపైనే అతని మార్కెట్ ఉంటుంది. కానీ అతని టాలెంట్ కు పంజా సినిమాలో నెగిటివ్ రోల్ లాంటిది లీడ్ రోల్ లో పడితే మాత్రం మాములుగా ఉండదు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో శేష్ క్యారెక్టర్ ఆల్ టైమ్ బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. అలాంటి సీరియస్ బోల్డ్ సినిమా చేస్తే అర్జున్ రెడ్డి తరహాలో మ్యాజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి శేష్ మార్కెట్ ఎంతవరకు వెళుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment