రవితేజ మళ్ళీ మొదటికే.. 10కోట్లు డౌటే?


క్రాక్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడని అనుకున్న మాస్ మహారాజ రవితేజ ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఒక ఏరియా హక్కులతో దాదాపు 15 కోట్లు అందుకున్నాడు. అయితే ఆ తరువాత అతనికి రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. ఖిలాడి అంటే అంతకుముందే అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి కొంత రెమ్యునరేషన్ ఇచ్చారు. 

అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు నిర్మాతలు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ రవితేజ మాత్రం ఆ సినిమాకు క్రాక్ ఫార్ములాను వాడుతున్నాడు. కానీ ఆ సినిమాకు ఇప్పుడు ఎలాంటి బజ్ లేదు. బయ్యర్లు ఎవరు కూడా సినిమాకు హైప్ లేని కారణంగా కొనేందుకు ముందుకు రావడం లేదు. చాలా వరకు సొంతంగా రిలీజ్ చేస్ పరిస్థితి ఏర్పడింది. జూన్ 29న విడుదల కానుంది కాబట్టి ఇంకాస్త సమయం ఉంది. మరి అప్పటి వరకు ఏదైనా హైప్ క్రియేట్ చేసి బజ్ క్రియేట్ చేస్తారో లెదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post