ఆదిపురష్.. ఎందుకంత అనుమానాలు?


బాహుబలి తర్వాత వరుసగా అపజయాలని ఎదుర్కొన్న ప్రభాస్ ఈసారి ఆది పురుష్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక రకాల డౌట్స్ అయితే ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి  ఇంతవరకు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు.

సంక్రాంతికి రిలీజ్ అంటే ఒక ఏడాది ముందు అయినా కనీసం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి కానీ ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉంది అయినప్పటికీ కూడా దర్శకుడు ఓం రావత్ ఒక్క పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేయకపోవడం షాకింగ్. ఆ మధ్య ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఏదో ఫాన్స్ చేసిన పోస్టర్లు మాత్రమే షేర్ చేసుకొని షాక్ ఇచ్చాడు. ప్రభాస్ లుక్ విషయంలో సంతృప్తిగా లేరా లేకుంటే ఒకేసారి హడావుడి క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా అనే విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫస్ట్ లుక్ లోడింగ్ అంటున్నారు కానీ వచ్చే వరకు తెలియదు.

Post a Comment

Previous Post Next Post