మహేష్ - విజయ్.. ఇదే నిజమైతే?


కోలీవుడ్ లో విజయ్ కు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు కూడా అదే తరహాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విజయ్ ఇప్పుడు తెలుగులో మెల్లగా తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదివరకే మహేష్ బాబు స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో చేదు అనుభవాన్ని ఎదుర్కొనగా రాజమౌళి సినిమాతో మాత్రం మంచి క్రేజ్ అందుకునే అవకాశం ఉంది.

అయితే ఈ క్రమంలో ఇద్దరికీ ఉపయోగపడేలా ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న వారసుడు సినిమాలో మహేష్ బాబు ప్రత్యేకమైన ఒక అతిధి పాత్రలో కనిపిస్తాడని టాక్ అయితే వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే గనక విజయ్ కు తెలుగులో మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక తమిళంలో విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబు వైవు యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారిపోయింది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మరి కొంతకాలం ఎదురు చూడాల్సిందే.

Post a Comment

Previous Post Next Post