వేరే దారిలేక.. RRR, పుష్ప మేకర్స్ ను ఒకటి చేస్తున్న పవన్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల సంఖ్య చాలానే ఉంది. చాలావరకు నిర్మాతల నుంచి పవన్ కళ్యాణ్ అడ్వాన్సులు అయితే తీసుకున్నాడు. అయితే వివిధ రాజకీయాల పనుల వలన పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయాన్ని షూటింగ్లకు కేటాయించలేకపోతున్నాడు. మరోవైపు ఎన్నికల హడావిడి కూడా మొదలు కావడంతో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు.

అయితే ఈ క్రమంలో ముందుగా చేసుకున్న ఒప్పందాల విషయంలో ఇటీవల మరో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది  పవన్ కళ్యాణ్ పుష్ప నిర్మాతలతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే RRR నిర్మాత దానయ్య నుంచి కూడా ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నాడు. కాబట్టి వీరిద్దరితో ప్రత్యేకంగా సినిమా చేయడం కంటే వారిద్దరిని కలిపి పూర్తి చేస్తే సరిపోతుంది అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ సినిమాలు చేయాలంటే కుదరని పని, అందుకే సంయుక్త ప్రొడక్షన్స్ లలో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.

పుష్ప ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా ఇంతవరకు పట్టాలు ఎక్కలేదు. ఇక RRR నిర్మాత DVV దానయ్య కూడా అడ్వాన్స్ ఇచ్చేశాడు. అప్పట్లో సుజిత్ తో కూడా ఒక సినిమా అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో దారి లేక ఈ సంస్థలను పవన్ మిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

Post a Comment

Previous Post Next Post