మరోసారి అనుష్క ప్రభాస్.. ట్విస్ట్ ఏమిటంటే!


రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి అనుష్కతో వెండి తెరపై రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అనుష్క కనిపించబోతున్నట్లు సమాచారం. వీరి కలయికలో ఇదివరకే బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలో వచ్చాయి. 

వరుసగా హాట్రిక్ సినిమాలతో మంచి కాంబినేషన్ గా గుర్తింపును అందుకున్న ప్రభాస్ అనుష్క మరోసారి మారుతి కోసం కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో ట్విస్ట్ ఏమిటంటే ప్రభాస్ అనుష్క మధ్యలో రియల్ లైఫ్ లో ఎలాగైతే పెళ్లి చేసుకోబోతున్నారు అని రూమర్స్ వస్తున్నాయో అదో తరహాలో మారుతి కూడా ఒక విభిన్నమైన కామెడీని హైలెట్ చేయబోతున్నట్లుగా టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అని చాలాసార్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ వారిద్దరు మాత్రం మంచి స్నేహితులు గాని కొనసాగుతూ వచ్చారు. ఇక ఇప్పుడు మారుతి తన సినిమాలో ఈ కాంబినేషన్ గాసిప్ ను ఎలా కనెక్ట్ చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post