శభాష్ కిరణ్ అబ్బవరం.. సాలీడ్ లైనప్


యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల సమ్మతమే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ అందుకొని తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక కిరణ్ కూడా మిడియం రేంజ్ హీరోగా అంటే టైర్ 2 రేంజ్ కు ఫాస్ట్ గానే చేరుకునెలా ఉన్నడు. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన కిరణ్ 3 సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

రాజవారు రాణిగారు - హిట్
SR కళ్యాణమండపం - బ్లాక్ బస్టర్
సెబాస్టియన్ - ఫ్లాప్
సమ్మతమే - బ్లాక్ బస్టర్

ఇక 2022లో మరికొన్ని నమ్మకమైన ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు.

*కోడి దివ్య ప్రొడక్షన్ లో నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఆగస్ట్ 18న విడుదల కానుంది.
*వినరో భాగ్యము విష్ణు కథ గీత ఆర్ట్స్ లో సెప్టెంబర్ 30న రాబోతోంది
*మైత్రి మూవీ మేకర్స్ & క్లాప్ బోర్డ్ లో కూడా డిసెంబర్ లో మరో సినిమా రానుంది.


2023లో రాబోయే సినిమాలు:
ఎమ్ రత్నం బ్యానర్ లో రూల్స్ రంజన్ అనే సినిమాతో పాటు ఏషియన్ సినిమాస్ లో కూడా ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ లో కూడా కిరణ్ మొదటిసారి ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. అలాగే మరొక న్యూ ప్రొడక్షన్ హౌస్ లో కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఒక సినిమాకు కమిట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ సినిమా కూడా బిగ్ బడ్జెట్ తోనే రానుంది. టోటల్ గా నాలుగు సినిమాలని కిరణ్ 2023లో విడుదల చేయబోతున్నాడు. 

చూస్తుంటే కిరణ్ ఆబ్బవరం ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లను పట్టేసినట్లు అనిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లోనే కంటిన్యుస్ గా హిట్స్ కొడుతు, మంచి లైనప్ తో ముదుకూ సాగుతున్న ఈ టాలెంటెడ్ హీరో టైర్ 2  రేంజ్ కు వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post