త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా.. ఎప్పుడంటే?


ఇండస్ట్రీలో అగ్ర హీరోలు స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బాటలో వెళుతుంటే ఆ స్థాయి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇంకా ఆ రూట్లోకి సెట్ అవ్వలేదు. అతనికి చాలామంది ఇది వరకే సలహాలు ఇచ్చినప్పటికీ ఎందుకో త్రివిక్రమ్ అటువైపు ధైర్యం చేయడం లేదు. ఇక రీసెంట్ గా అయితే ఒక స్టార్ హీరో త్రివిక్రమ్ ను ఒప్పించి పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ అని తెలుస్తోంది. ఇదివరకే బన్నీతో మూడు సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ బన్నీతోనే  పాన్ ఇండియా సినిమా ప్రయాణం మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాను  చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత బన్నీతో పాన్ ఇండియా సినిమా పై ఆలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post