మెగాస్టార్.. అదొక మిస్టేక్ మాత్రమే!


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రెండ్రోజుల క్రితం విడుదలై భారీ స్పందనను అందుకుంది. చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టాడు అనే చెప్పాలి. అయితే ఆ వీడియోలో చిరంజీవి పేరును కాస్త ఇంగ్లిష్ లో మార్చడం వైరల్ అయ్యింది. Chiranjeevi పేరులో ఒక E ని ఎక్కువగా జత చేయడంతో న్యూమరాలజీ కోసం మార్చుకున్నట్లు వార్తలు అల్లెశారు.

అయితే ఇది కేవలం స్పెల్లింగ్ మిస్టేక్ అని, ఇప్పటికే సరిదిద్దామని టీమ్ నుంచి క్లారిటీ వచ్చేసింది.  యూట్యూబ్‌లోని గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ వీడియోలో కూడా ఎడిట్ చేస్తారట. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  జయం మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2022 విజయదశమికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

Post a Comment

Previous Post Next Post