కళ్యాణ్ రామ్.. ఫ్యామిలీ పీక్ వైరల్!


ఈసారి నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త చిత్రం బింబిసారతో వెండితెరపైకి వస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక జూలై 5న తన పుట్టినరోజును జరుపుకున్న ఈ నటుడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్ ఫొటోకి స్టిల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, అతను తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి, కుమార్తె తారక అద్వైత అలాగే కుమారుడు సౌర్య రామ్‌తో కలిసి కనిపించారు.  అతని పిల్లలిద్దరూ టీనేజ్‌లో ఉన్నారు.  ఈ కుటుంబ చిత్రం అందంగా ఉంది. ఇక అభిమానులు కూడా దీన్ని ఇష్టపడుతున్నారు. సాధారణంగా, కళ్యాణ్ రామ్ కుటుంబాన్ని ఎప్పుడు కూడా పబ్లిక్‌గా చూపించింది లేదు.  దీంతో ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇక బింబిసార విషయానికి వస్తే, ఈ చిత్రం యొక్క ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలై మంచి క్రేజ్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కి నూతన దర్శకుడు వశిష్ట్ దర్శకత్వం వహించాడు.

Post a Comment

Previous Post Next Post